Scented Smartphone Alert! - సువాసనలు వెదజల్లే స్మార్ట్‌ఫోన్ చూశారా? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే!
దేశీయ మార్కెట్‌లోకి Infinix నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. "Infinix Note 50s 5G+" పేరుతో ఈ ఫోన్ శుక్రవారం లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Ultimate చిప్‌సెట్, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ఉన్నాయి.
ఈ ఫోన్ దేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇందులో 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే కంపెనీ ఈ ఫోన్‌లో 'ఎనర్జైజింగ్ సెంట్ టెక్నాలజీ'ని ఉపయోగించింది. దీంతో ఫోన్ మంచి సువాసనను వెదజల్లుతుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. మరెందుకు ఆలస్యం ఈ ఫోన్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
Infinix Note 50s 5G+ Features in Telugu
Display
ఇందులో 6.78-అంగుళాల పూర్తి-HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,304Hz PWM డిమ్మింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
Processor
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Ultimate SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను అందిస్తుంది.
Operating System
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్ట్ XOS 15పై నడుస్తుంది. గేమింగ్ సమయంలో ఇది 90fps వరకు ఫ్రేమ్ రేట్లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
Camera Setup
ఈ ఫోన్ 64-మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందుభాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది డ్యూయల్ వీడియో క్యాప్చర్, ఫోలాక్స్ AI అసిస్టెంట్, AI వాల్‌పేపర్ జనరేటర్, AIGC మోడ్, AI ఎరేజర్ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది.
Battery
ఇందులో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డు ఆల్-రౌండ్ ఫాస్ట్‌చార్జ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీని గంటలో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని ఇన్ఫినిక్స్ పేర్కొంది.
Protection
ఈ ఫోన్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ రేటింగ్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
Infinix Note 50s 5G+ Variants and Price in India
కంపెనీ ఈ 'Infinix Note 50s 5G+' ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 8GB + 128GB
- 8GB + 256GB
వేరియంట్ల వారీగా 'Infinix Note 50s 5G+' ధరలు:
- 8GB + 128GB వేరియంట్ ధర: ₹ 15,999
- 8GB + 256GB వేరియంట్ ధర: ₹ 17,999
Sale Details and Launch Offers
ఈ ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్స్‌తో ఈ ఫోన్‌ను ₹ 14,999 ధరకే పొందొచ్చు.
Color Options
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది:
- మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ
- రూబీ రెడ్
- టైటానియం గ్రే
Smartphone with Fragrance Technology
దీని రూబీ రెడ్, టైటానియం గ్రే వేరియంట్లు మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉన్నాయి. అయితే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ ఆప్షన్‌లో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఇందులో మైక్రోఎన్‌క్యాప్సులేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇది వీగన్ లెదర్ ప్యానెల్‌కు మెరైన్ అండ్ లెమన్, లిల్లీ ఆఫ్ ది వ్యాలీ నోట్స్, అంబర్ అండ్ వెటివర్ బేస్ నోట్స్‌తో కూడిన ఫ్రాగ్రెన్స్ వెదజల్లుతుంది. దీన్ని కంపెనీ 'ఎనర్జైజింగ్ సెంట్ టెక్నాలజీ'గా పిలుస్తోంది. అంటే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ ఆప్షన్‌లోని ఈ ఫోన్ నుంచి సువాసనలు వెదజల్లుతాయని ఇన్ఫినిక్స్ చెబుతోంది. అయితే స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ సువాసన ఎంతకాలంపాటు వస్తుందో వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి
SPACE WASTE SOLUTION: ఈ సమస్య కు పరిష్కారం చెప్పండి! 26కోట్ల బహుమతి అందుకోండి !!
Banks Merging: బ్రేకింగ్ న్యూస్! 🔥 మే 1 నుంచి ఈ 15 బ్యాంకులు విలీనం
0 Comments