⛓️ పూరీ ఆలయంలో బేడీల హనుమంతుడు: రహస్యం ఏమిటి? 🌊
🌟 ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలకు నిలయం. పూరీ జగన్నాథుని ఆలయంలో ఆంజనేయస్వామిని బేడీలతో బంధించి ఉంచడానికి ఒక పురాణగాథ ఉంది.
🌊 పూరీ క్షేత్రంలో జగన్నాథుడు వెలసిన అనంతరం ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆలయాన్ని సందర్శించాడట. అప్పుడు ఆలయంలో ఊరంతా చేరడంతో సముద్రుడి నుంచి రక్షించమని ప్రజలు జగన్నాథుడిని ప్రార్థించారట.
🙏 ప్రజల బాధలు చూసిన జగన్నాథ స్వామి క్షేత్రానికి రక్షకుడుగా ఉండే హనుమంతుని విచారించగా, హనుమంతుడు జగన్నాథుని అనుమతి లేకుండా అయోధ్య వెళ్లినట్టు తెలుసుకుంటాడు. అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుని కాళ్లు చేతులను తాడుతో కట్టేశాడట. అంతేకాకుండా అక్కడి నుంచి ఎక్కడికీ కదలకుండా ఈ క్షేత్రంలో సముద్రుడు రాకుండా కాపలా కాయాలని చెప్పాడట.
🔗 అప్పటినుంచి ఆ క్షేత్రంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడు. అప్పుడే ఆ స్వామి వారికి “దరియా మహావీర” అని పేరు వచ్చిందట. దరియా అంటే సముద్రం అని అర్థం. అప్పటినుంచి వాయుపుత్రుడు పూరి నగరాన్ని రక్షిస్తున్నాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే ఈ అంజనీపుత్రున్ని “బేడీ హనుమంతుడు” అని కూడా పిలుస్తారు.
🛡️ హనుమంతుడు కాపలాగా ఉన్నప్పటినుంచి నగరానికి సముద్రం ఎంత దగ్గర ఉన్నా, తుఫాను వచ్చినా ఆ నగరంలోకి సముద్రపు నీరు రాదని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ కారణంగానే పూరీ జగన్నాథ ఆలయంలో హనుమంతుడిని సంకెళ్లతో బంధిస్తారు.
0 Comments