WhatsApp Blocked? వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..
WhatsApp Messaging Tips After Block: కోపం, అసహనం పెరిగిపోయినప్పుడు అవతలి వ్యక్తి నంబర్ బ్లాక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా వారికి మెసేజ్ చేయడం కుదరదు అనే అనుకుంటాం. కానీ, ఈ టిప్స్ పాటిస్తే గనక మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయవచ్చు.
WhatsApp Blocked? వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..
WhatsApp Messaging Tips After Block: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ అకౌంట్ ఉంది. ఆఫీసు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు అత్యధిక మంది ప్రజలు ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఇదే. భద్రతా కారణాల దృష్ట్యా బ్లాకింగ్ ఆప్షన్ ప్రవేశపెట్టినా.. చాలా సందర్భాల్లో కోపం లేదా ఇతర కారణాల వల్ల వచ్చినపుడు సన్నిహితుల నంబర్లనే బ్లాక్ చేస్తుంటారు కొందరు. ఇలా జరిగినపుడు అవతలి వారికి WhatsApp ద్వారా సందేశాలు లేదా కాల్స్ చేయలేరు. కానీ కొన్ని ఉపాయాలు పాటిస్తే మిమ్మల్ని బ్లాక్ చేసినా సదరు వ్యక్తికి మీరు మెసేజ్ పంపవచ్చు.
WhatsApp Group Creation - వాట్సాప్‌లో బ్లాక్ చేసిన తర్వాతా మెసేజ్ పంపేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి 💬
వాట్సాప్‌లో బ్లాక్ చేసిన తర్వాతా మెసేజ్ పంపేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వ్యక్తిని ఇందులో యాడ్ చేయండి. మిమ్మల్ని బ్లాక్ చేసినప్పటికీ ఈ గ్రూప్ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడవచ్చు.
New WhatsApp Account - కొత్త వాట్సాప్ అకౌంట్ 📱
ప్రస్తుతం ఉన్న వాట్సాప్ ఖాతా డిలీట్ చేసి వాట్సాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత కొత్త నంబర్ లేదా రెండో నంబర్ ద్వారా ఖాతాను క్రియేట్ చేయండి. అలా మీరు బ్లాక్ చేసిన వ్యక్తిని WhatsAppలో కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే, దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇది మోసపూరితంగా లేదా అనుచితంగా పరిగణించబడుతుంది.
Friend's Help - ఫ్రెండ్ సాయం 🤝
మీ స్నేహితుడి అకౌంట్ నుంచి బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు చెప్పదల్చుకున్న విషయాన్ని మెసేజ్ చేయండి. కానీ, ఈ పద్ధతి లాస్ట్ ఆప్షన్ గానే ఎంచుకోండి. ఇలా చేస్తే అవతలి వ్యక్తికి మరింత కోపం రావచ్చు.
How to Check WhatsApp Block? వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా? ❓
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా?
మీ స్నేహితుడు లేదా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని మీకు అనుమానం వస్తే ముందుగా వారి ఆన్‌లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ చెక్ చేయాలి. మీరు ఈ రెండింటినీ మొదట చూసి తరువాత చూడకపోతే బహుశా మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు లెక్క. అలాగని మిమ్మల్ని 100% బ్లాక్ చేశారనే గ్యారెంటీ ఏం లేదు. ప్రైవసీ సెట్టింగ్స్ లో ఈ రెండు ఆప్షన్లు ఎంచుకునే ఛాన్స్ కూడా ఉండవచ్చు. అలాగే, సందేశం పంపిన తర్వాత డబుల్ టిక్‌లు, బ్లూ టిక్‌లు కనిపించకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. ఇది కూడా కచ్చితంగా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అవతలి వ్యక్తి ప్రైవసీ సెట్టింగ్స్ లో డబుల్ టిక్ లేదా బ్లూ టిక్‌ను కనపడకుండా ఉండేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు.ఒకవేళ మీరు సెండ్ చేసిన మెసేజ్ డెలివరీ కాకపోయినా లేదా అవతలి వ్యక్తిని గ్రూప్‌లో చేర్చలేకపోయినా బ్లాక్ చేయబడ్డారని అర్థం.
0 Comments