Teachers Transfers: ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం 🔔
Teachers Transfers: ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం ✅
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ మరియు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.
Teachers Transfers Schedule: ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక 🗓️
- సర్వీసుకు ప్రామాణిక తేదీ: మే 31
- హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు మినహాయింపు
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా, స్టేటస్కో విధించింది. దీంతో ఆ పోస్టులను మినహాయించి, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తారు. కోర్టు తీర్పునకు లోబడి ఆ తర్వాత అంధ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించనుంది. విడాకులు తీసుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్య పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల 15 నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేస్తారు. దాంతో ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకూ ఆదర్శ పాఠశాలల హెచ్ఎంలుగా అవకాశం ఇస్తారు.
Teachers Seniority List: సిద్ధమైన సీనియారిటీ జాబితా 📜
ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓ-117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేశారు. బదిలీలను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.
Teachers Transfers Eligibility: బదిలీల అర్హతలు 👇
- మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు మరియు 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన హెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది.
- రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- గరిష్ఠ సర్వీసు పూర్తయి ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు.
- ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం వర్తించదు.
Teachers Transfers Points System: పాయింట్ల విధానం 📊
- పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. ఏడాదికి కేటగిరీ-1కు ఒకటి, కేటగిరీ-2కు రెండు, కేటగిరీ-3కు మూడు, కేటగిరీ-4లో ఉన్న వారికి అయిదు పాయింట్లు ఇస్తారు. హెచ్ఆర్ఏ, రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరీల్లో మార్పులుంటే పాయింట్లలోనూ మార్పు చేస్తారు.
- ఏడాదికి ఒక 0.5 చొప్పున సర్వీసుకు పాయింట్లు ఇస్తారు. మే 31 నాటికి ఏడాదిగా పరిగణిస్తారు.
- స్పౌజ్, 40 ఏళ్లు దాటిన అవివాహిత, దివ్యాంగులు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వితంతువు, క్యాన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారికి, ఉద్యోగిపై ఆధారపడి ఉన్నవారికి ప్రత్యేక పాయింట్లు ఇస్తారు.
- హేతుబద్ధీకరణలో పోస్టు కోల్పోయే టీచర్లు రేషనలైజేషన్ పాయింట్లు లేదా పాత స్టేషన్ పాయింట్లలో ఏదో ఒక దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
- మే 31 నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే ఉండే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. కావాలనుకుంటే వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- బదిలీలపై గ్రీవెన్స్ తర్వాతే కోర్టుకు వెళ్లాలి. గ్రీవెన్స్‌కు వివిధ స్థాయిల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
- ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ తర్వాత వయసును పరిశీలిస్తారు.
- ఏవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే నెలకు ఒకటి చొప్పున గరిష్ఠంగా 10 మైనస్ పాయింట్లు ఉంటాయి.
Teachers Vacancy Notification: ఖాళీల నోటిఫికేషన్ ఇలా.. 📢
- మే 31 నాటికి పదవీ విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీకి తీసుకుంటారు.
- తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు.
- రేషనలైజేషన్‌తో వచ్చే ఖాళీలు.
- ఏడాది అంతకుమించి అనధికారికంగా గైర్హాజరు అయిన టీచర్ల స్థానాలు.
- ఉన్నత చదువుల కోసం టీచర్లు సెలవులు తీసుకుంటే వాటిని ఖాళీగా చూపుతారు.
- బదిలీల కౌన్సెలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు.
- ఆయా జిల్లాల్లోని మొత్తం ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు ఒక జిల్లాలో 5 వేల పోస్టులు ఉండి.. 4,500 మంది పనిచేస్తుంటే బదిలీల్లో 4,500, దీనికి అదనంగా డీఎస్సీ పోస్టులు కలిపి చూపుతారు.
0 Comments