సోషల్ మీడియా ప్రస్తుతం వీడియో క్రియేటర్లకు ఆర్థిక వనరుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా కంటెంట్ క్రియేటర్లకు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ‘టెస్టిమోనియల్స్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది భాగస్వామ్య ప్రకటన (Partnership Ad) లో భాగంగా క్రియేటర్ల ఆదాయాన్ని పెంచుతుంది.
‘టెస్టిమోనియల్స్’ ద్వారా ఆదాయ అవకాశాలు
ఈ కొత్త ప్రకటన విధానంలో కేవలం టెక్స్ట్ ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. ఇతర ప్రకటనల మాదిరిగా వీడియోలు అవసరం లేదు. క్రియేటర్లు ఒక చిన్న సందేశాన్ని రాస్తే, అది వీడియో కామెంట్ సెక్షన్‌లో పైభాగంలో ప్రదర్శించబడుతుంది.
125 అక్షరాల పరిమితి – ఫాస్ట్ ప్రమోషన్!
- కంటెంట్ క్రియేటర్లు 125 అక్షరాల లోపు ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా బ్రాండ్ లేదా ప్రొడక్ట్ ప్రచారం చేయొచ్చు.
- ఈ టెక్స్ట్ మెసేజ్‌ను వీడియోతో అనుసంధానించి బ్రాండ్‌కు సమర్పించవచ్చు.
- బ్రాండ్ ఆమోదం తర్వాత, ఈ సందేశం ‘Sponsored’ ట్యాగ్‌తో పైభాగాన పిన్ చేయబడుతుంది.
- వీక్షకులకు ఇది ప్రమోషనల్ కంటెంట్ అని స్పష్టంగా తెలుస్తుంది.
కొత్త ఫీచర్ ప్రయోజనాలు
- వేడియోల తక్కువ అవసరం – కేవలం టెక్స్ట్ ద్వారా ప్రచారం.
- త్వరగా ప్రకటనలు పోస్ట్ చేయగలిగే అవకాశం.
- కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయ మార్గం.
మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ కొత్త యాడ్ ఫార్మాట్ గురించి వివరంగా తెలియజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త ‘టెస్టిమోనియల్స్’ విధానం ద్వారా కంటెంట్ క్రియేటర్లు త్వరితగతిన బ్రాండ్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకుని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది.
0 Comments